యురేనియం తవ్వకాలతో రెండు రాష్ట్రాలకు ముప్పే...
03-09-2019 08:45:39
నల్లమల అడవులు నాశనమే
కృష్ణా జలాలు విషమయం
ఆ నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు
దీన్ని తెలుగు ప్రజలంతా వ్యతిరేకించాలి : సీనియర్ శాస్త్రవేత్త కె. బాబురావు
యురేనియం కోసం నల్లమల అడవుల్లో తవ్వకాలు చేపడితే పర్యావరణానికి ముప్పు తప్పదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విశ్రాంత సీనియర్ సైంటిస్ట్ కె. బాబురావు హెచ్చరిస్తున్నారు. కృష్ణా జలాలు విషతుల్యం అవుతాయని, ఆ నీటిని తాగితే మూత్ర పిండాలకు ముప్పేనని, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి మరెన్నో ఆరోగ్య సమ్యలు తలెత్తుతాయని అంటున్నారు. ‘‘బహుజన బతుకమ్మ’’ నినాదంతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ‘‘యురేనియం తవ్వకాలు - ప్రకృతి విధ్వంసాలు’’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావును ఆంధ్రజ్యోతి పలకరించగా.. ఆయన చెప్పిన వివరాలు తన మాటల్లోనే.
హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి):
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు మొదలైతే, నగర వాసులకు ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి?
ప్రకృతి సరిగా ఉంటేనే హాయిగా జీవించగలం అనే నిజాన్ని పట్టణ వాసులు గుర్తించాలి. నల్లమలలో యురేనియం కోసం తవ్వితే ప్రజలకు ప్రాణవాయువు అయిన అడవులు నాశనమవుతాయి. దాంతో వాతావరణ అసమతుల్యత ఏర్పడుతుంది. సకాలంలో వర్షాలు పడవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భూమిలోని యురేనియంను వెలికితీసి, దాన్ని శుద్ధి చేసే క్రమంలో ఆ రసాయన వ్యర్థాలన్నీ కృష్ణానదిలో కలుస్తాయి. దీంతో నదీజలాలు కలుషితమవుతాయి. అలా జరిగితే హైదరాబాద్ వాసులు ఆ యురేనియం కలిసిన నీళ్లే రోజూ తాగాల్సివస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ హైదరాబాదీయులు కదం తొక్కాలి.
ఆంధ్రప్రదేశ్‌లోనూ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారా ?
2005లో పెద్దగట్టు, లంబాపూర్ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ అందుకు అనుమతి కూడా ఇచ్చింది. ‘యురేనియం అంటూ తవ్వితే నగరానికి సరఫరా అయ్యే నీటి నాణ్యతను మేం కాపాడలేం’ అని ఆనాడు హైదరాబాద్ జలమండలి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాలే కాదు, నల్లమలలోనూ తవ్వుతారట. యురేనియం కోసం విస్తృతంగా తవ్వకాలు చేపడితే ప్రజారోగ్యం, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకించాలి.
యురేనియం తవ్వకాల వెనుక దాగున్న అసలు ఉద్దేశాలు ఏంటి ?
యురేనియం తవ్వకాల వెనుక యుద్ధోన్మాద కాంక్షే కనిపిస్తుంది. రాజకీయ మనుగడ ఎప్పుడూ బలం ఆధారంగా సాగుతుంది. ‘‘మేము భారతదేశాన్ని చాలా బలవంతమైన దేశంగా తయారుచేశాను. మా వద్ద బాంబులున్నాయి’ అని పాలకులు చాటుకోవడం కోసమే అని నా అభిప్రాయం. దానివల్ల ప్రయోజనం శూన్యం. యురేనియంతో విద్యుత్ ఉత్పత్తి చేసినా, దాని నుంచి వచ్చిన మిగిలిన వ్యర్థాలను బాంబుల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా చాలామంది శాస్త్రవేత్తలు ‘‘అణువిద్యుత్‌ను ఆపకుండా, అణుబాంబులను ఆపలేమని’’ చెబుతున్నారు. అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ వంటి దేశాలు అణుశక్తి లేకుండానే బాంబు తయారు చేసుకోలేదా అని భారత అణుశక్తి సంస్థ చెబుతుంది. అణుశక్తితో తయారుచేయడం సులువైన విధానం. ఖర్చు కూడా చాలా తక్కువ. అది యురేనియం రూపంలో రెడీమేడ్‌గా దొరుకుతుంది. అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తే వాటి నుంచి కావాల్సినన్ని బాంబులు తయారుచేసుకోవచ్చు.
యురేనియం తవ్వకాలతో నష్టపోయిన దేశాలు?
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్ తదితర దేశాల్లో యురేనియం తవ్వకాలు జరిగాయి. తవ్వకాలతో ప్రమాదానికి గురికాని దేశం లేదు. అమెరికా, న్యూమెక్సికో రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు జరిపారు. కొన్నాళ్ల తర్వాత ఆ ప్రాంతంలో ఊపిరితిత్తుల కేన్సర్, సిలికోసిస్ వ్యాధులతో మరణాలు పెరిగాయి. చర్చిరాక్ ప్రాంతంలో యురేనియం వ్యర్థాలు నిల్వచేసిన చెరువు కట్టలు తెగి, రియో పువర్కో నదిలో కలిశాయి. ఆ నీళ్లన్నీ వృథా అయ్యాయి. అందులోని జీవులన్నీ మరణించాయి. ఆ ప్రాంతమంతా బొందల గడ్డగా మారింది. ఇలాంటి ఉదాహరణలు మరెన్నో.
భూమిలో నుంచి తీసిన యురేనియంను శుద్ధి చేసేందుకు అనువైన వ్యవస్థ మనవద్ద ఉందంటారా ?
ముడి ఖనిజం శుద్ధి చేసి యురేనియం తీసే యంత్రాంగం మన వద్ద ఉంది. రియాక్టర్ల నుంచి వాడేసిన ఇంథనం (స్పెంట్ ఫియల్‌ను), అందులోని అణుధార్మిక పదార్థాలను తొలగించి, వాటిని ప్రమాద రహితంగా చేసి నిక్షిప్తం చేసే వ్యవస్థ మన వద్ద లేదు. ఆ వ్యర్థాలలోని ఫ్లుటోనియంను తీసి బాంబుల తయారీలో వాడతారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు ఒక ప్రాంతంలోనే చేపట్టడం లేదు. రెండుచోట్ల 38 చ.కి.మీ, మరో ప్రాంతంలో నాలుగు చ.కి.మీ, ఇంకో చోట మూడు చ.కి.మీ. తవ్వుతున్నారు. దాంతో అక్కడ తవ్విన ముడి ఖనిజాన్ని శుద్ధి కర్మాగారానికి సరఫరా చేసే క్రమంలో నల్లమల అడవి అంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. రవాణా సమయంలో ఏర్పడే వాహనాల రొదతో చాలా జీవరాశులు పారిపోతాయి. జంతువులు లేని అడవి అడవి కాదు.
కడప జిల్లా తుమ్మలపల్లి పరిసరాల్లో ప్రస్తుతం నెలకొన్న పర్యావరణ, ప్రజారోగ్య పరిస్థితి గురించి...?
యురేనియం కార్పొరేషన్ కంపెనీల నిర్వాకం భయంకరం. కడపలో వాళ్లు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. సరైన నియంత్రణ వ్యవస్థే లేదు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి నోటీసు ఇస్తే.. మాకు సంబంధం లేదంటారు. యురేనియం కంపెనీ ప్రారంభమైన చోట, 33 శాతం విస్తీర్ణంలో మొక్కలు పెంచాలనేది నిబంధన. ఒక్క మొక్క కూడా నాటని వైనం ఆ కంపెనీది. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి, తమ్ముడిని అక్కడ కూర్చోబెట్టి, ప్రజల నోళ్లు మూయించి సొంత నియోజకవర్గంలో యురేనియం తవ్వకాలకు అనుమతించారు. ప్రస్తుతం అక్కడ చాలా గ్రామాల వాళ్లు తీవ్ర నష్టాన్ని అనుభవిస్తున్నారు. నీళ్లు వ్యవసాయానికి యోగ్యం కావని, ఆ నేలలో పంటలు పండవని శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని ఊళ్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అక్కడి గనిలో పనిచేసే కార్మికులు చాలామంది పురుషులు నపుంసకత్వానికి గురయ్యారు.
2016, డిసెంబర్‌లో చెన్నై రీజనల్ ఆఫీసు, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుడు యురేనియం కంపెనీ నిర్వహణ తీరును పరిశీలించాడు. అందులో తేలిన అంశాలతో 2017, జనవరిలో ఒక రిపోర్టు తయారు చేశాడు. పర్యావరణ అనుమతిలోని తొమ్మిది నిబంధనలల్లోని ఒక్కటి కూడా యురేనియం కంపెనీ పాటించలేదు. ఇన్నేళ్లుగా వాళ్ల నిర్వాకంపై చర్యలు తీసుకోలేదు. సమస్య తీవ్రతను తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌కు లేఖ రాశాను. దానిపై వాళ్ల నుంచి స్పందన లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.
యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ?
యురేనియం తవ్వకాల వల్ల రాడాన్ అనే అణుధార్మిక వాయువు వెలువడుతుంది. ఆ గాలి పీల్చిన వారు ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. యురేనియం వ్యర్థాలు కలిసిన నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు పుట్టే అవకాశం ఉండకపోవచ్చు.

No comments:
Post a Comment