Wednesday, September 18, 2019

ఈ-సిగరెట్లపై నిషేధం - కేంద్రం కీలక నిర్ణయం


కేంద్రం కీలక నిర్ణయం : ఈ-సిగరెట్లపై నిషేధం
Sep 18, 2019, 15:50 IST
Union Cabinet Approves Ban E Cigarettes Says Nirmala Sitharaman - Sakshi
ఎలక్ర్టానిక్‌ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర కేబినెట్‌ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ర్టానిక్‌ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ వివరాలను వెల్లడించారు. దేశంలోని యువతపై ఈ-సిగరెట్లు చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని, దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల తయారీ, వాడకంపై నిషేధం విధిస్తున్నాం. వాటిపై ప్రకటనలు, విక్రయం కూడా ఇక నేరమే. దీనికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది’ అంటూ కేబినెట్‌ నిర్ణయాలను నిర్మలా వివరించారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.

ఈ-సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ సిగరెట్లను కలిగిఉంటే ఆరు నెలల వరకూ జైలు శిక్ష రూ 50,000 జరిమానా విధించేలా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. కేంద్ర కేబినెట్‌ భేటీలో ఆర్డినెన్స్‌కు బుధవారం ఆమోదం తెలిపింది.

NEW YORK BANS FLAVOURED E-CIGARETTES FOLLOWING SEVERAL VAPING RELATED DEATHS

NEW YORK BANS FLAVOURED E-CIGARETTES FOLLOWING SEVERAL VAPING RELATED DEATHS
Shops in New York now have two weeks to remove vaping products from their shelves.


AGENCE FRANCE-PRESSESEP 18, 2019 09:13:38 IST

New York became the second US state to ban flavoured e-cigarettes Tuesday, following several vaping-linked deaths that have raised fears about a product long promoted as less harmful than smoking.

A health council passed emergency legislation proposed by Governor Andrew Cuomo outlawing flavoured vaping products amid an outbreak of severe pulmonary disease that has killed seven people and sickened hundreds.

The ban comes into force with immediate effect. Michigan became the first state to declare a ban earlier this month, but that law has yet to be implemented.

"It is undeniable that vaping companies are deliberately using flavours like bubblegum, Captain Crunch and cotton candy to get young people hooked on e-cigarettes — it's a public health crisis and it ends today," said Cuomo.

President Donald Trump's administration announced last week that it would soon ban flavoured e-cigarette products to stem a rising tide of youth users.

New York bans flavoured e-cigarettes following several vaping related deaths
e-cigarette are being banned because of the several death it is causing.

The move could later be extended to an outright prohibition of vaping if adolescents migrate to tobacco flavours, seen as more legitimate products that help smokers quit their habit, said the Food and Drug Administration (FDA), which regulates e-cigarettes.

"New York is not waiting for the federal government to act, and by banning flavoured e-cigarettes we are safeguarding the public health and helping prevent countless young people from forming costly, unhealthy and potentially deadly life-long habits," Cuomo added.

Popular with adolescents
Shops in New York now have two weeks to remove vaping products from their shelves. The ban does not prohibit menthol or tobacco-flavoured e-cigarettes.

E-cigarettes have been available in the US since 2006 and are sometimes used as an aid to quit smoking traditional tobacco products like cigarettes.

Their use among adolescents has skyrocketed in recent years: some 3.6 million middle and high school students used vaping products in 2018, an increase of 1.5 million on the year before.

The Centers for Disease Control and Prevention (CDC) recently that there were now more than 450 possible cases of pulmonary illness associated with vaping in the US.

The ban does not prohibit menthol or tobacco-flavoured e-cigarettes.
The ban does not prohibit menthol or tobacco-flavoured e-cigarettes.

The CDC has cautioned against vaping as officials investigate the precise cause of the deaths. No single substance has been found to be present in all the laboratory samples being examined.

New York's health department found very high levels of vitamin E oil in cannabis cartridges used by dozens of people in the state who had fallen ill after using e-cigarettes.

Vitamin E is a commonly used nutritional supplement but is dangerous when inhaled.

San Francisco, the home of market leader Juul Labs, became the first American city to ban e-cigarettes in June last year.

The FDA has warned Juul to stop advertising itself as a less harmful alternative to smoking, noting, in particular, the company's attempts to attract young people.

Sunday, September 15, 2019

ఊళ్ళన్నీ విషమే !


ఊళ్లన్నీ విషమే!
16-09-2019 03:27:57

కాలకూటం చిమ్ముతున్న తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం
పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు కలుషితం
భూములు నిస్సారం.. పండని పంటలు
మరింత లోతుకు భూగర్భ జలాలు
500 ఫీట్లకు బోరు వేసినా చుక్క రాదు
దండగగా మారిన యవుసం
ఎకరం ధర రూ.50 వేలలోపే
అయినా భూములను కొనేదిక్కులేదు
రోగాల బారిన పడుతున్న ప్రజలు
పెరుగుతున్న కేన్సర్‌, కిడ్నీ బాధితులు
అక్కడి ఊర్లకు పిల్లనివ్వాలంటేనే జంకు
నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 15: అది ఆస్ట్రేలియాలోని డార్విన్‌ నగరానికి 105కిలోమీటర్లలోని రమ్‌ జంగల్‌ ప్రాంతం. 1970లో అక్కడ రెండు యురేనియం బావులను తవ్వారు. 1971లోనే పనులను ఆపేశారు. 48 ఏళ్లు గడిచినా పర్యావరణపరంగా ఇప్పటికీ అది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమే! యురేనియం వ్యర్థాలతో దీనికి దగ్గర్లోనే ప్రవహించే ఫిన్నిస్‌ నది పూర్తిగా కలుషితమైపోయింది. అచ్చంగా బ్రెజిల్‌లోని అంటాస్‌ రిజర్వాయర్‌ తరహాలోనే! యురేనియం తవ్వకాలు జరపడమంటే అది దిద్దుకోలేని తప్పేనని బ్రెజిల్‌, ఆస్ట్రేలియా దేశాల అనుభవాలు గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఎక్కడో ఉన్న ఆ దేశాల గురించి ఎందుకు? యురేనియం తవ్వకాలతో చోటుచేసుకున్న విపరిణామాలకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే ఉదాహరణ. మహబూబ్‌నగర్‌కు కేవలం 325కిలోమీటర్ల దూరంలోని కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో 13ఏళ్ల క్రితం యురేనియం శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పారు. శుద్ధితో వెలువడిన అత్యంత హానికరమైన రేడియోధార్మికత అక్కడి ప్రజల బతుకులను ఛిద్రం చేసింది.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


Supermoon - Ft. Russell Peters World Tour.
Pune | Ahmedabad | Hyderabad Oct 1st - Oct 6th
Book Now
తుమ్మలపల్లి దాని పరిసర గ్రామాలైన మబ్బుచింతలపల్లి, రాసుకుంటపల్లి, భూమయ్యగారి పల్లి, కొట్టాల, కన్నంపల్లి తదితర ఎన్నో గ్రామాల్లో పీల్చేగాలి.. తినే తిండి.. తాగేనీరు అన్నీ కలుషితమైపోయాయి. ఊపిరితిత్తుల కేన్సర్‌, కిడ్నీ వ్యాఽధి బాధితులు పెరిగారు. మునుపు మిర్చి, పత్తి పంటలు పండేవి. సారం దెబ్బతిని భూములు గుల్లగా మారాయి. సాగు పనులే బంద్‌ అయ్యాయి. యురేనియం కోసం నల్లమల కొండలను తొలిస్తే.. తుమ్మలపల్లి మాదిరి విపరిణామాలనే తెలంగాణ ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చేజేతులా జీవన విధ్వంసానికి బాటలు పరిచినట్లే అవుతుంది.

తుమ్మలపల్లి.. ఆ సమీప గ్రామాల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే! యురేనియం కర్మాగారం మా బతుకులను తినేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నా ఒళ్లంతా రోగాల పుట్టగా మారింది. నరాలు చచ్చుబడిపోతున్నాయి. నాకు రెండుసార్లు పక్షవాతమొచ్చింది. మావోడు గోపిరెడ్డికి నిండా 30 ఏళ్లులేవు.. షుగరొచ్చింది. ఊపిరితిత్తుల కేన్సర్‌, మూత్రపిండాల వ్యాధి బాధితులు పెరిగిపోతున్నారు. కాళ్ల నొప్పులు, బీపీతో బాధపడుతున్న వారి గురించి లెక్కేలేదు’ తుమ్మలపల్లికి చెందిన ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి గోడు ఇది! ఈ తరహా అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అక్కడ ఎందరో ఉన్నారు. 2.75లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపడితే నాగర్‌కర్నూల్‌, కర్నూలు, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రజాజీవితం, వాతావరణ సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తల ఆందోళన నేపథ్యంలో తుమ్మలపల్లి.. ఆ సమీప ప్రాంతాల్లోని ప్రజల స్థితి గతులను ‘ఆంధ్రజ్యోతి’ నాగర్‌కర్నూల్‌ జిల్లా బృందం పరిశీలించింది.

ముప్పులేదని మాటిచ్చి..
2006లో రూ. 1,106 కోట్లతో తుమ్మలపల్లిలో దాదాపు పది లక్షల టన్నుల ముడి యురేనియాన్ని శుద్ధి చేసే ప్లాంటును నెలకొల్పారు. యురేనియం వ్యర్థాలతో వెలువడే విష రసాయనిక పదార్థాల నుంచి పర్యావరణానికి ముప్పు లేకుండా చేస్తామంటూ అప్పట్లో యూసీఐఎల్‌ పేర్కొంది. ఈ మాటలకు, వాస్తవపరిస్థితులకు పొంతన లేదనే సంగతి కొన్నాళ్లకే స్పష్టమైంది. యురేనియం ప్రాసెసింగ్‌ కేంద్రంలో స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తామంటూ భరోసా ఇవ్వడంతోనే.. ప్రాసెసింగ్‌ కేంద్రం ఏర్పాటుకు గ్రామస్థులు అంగీకరించారని మ బ్బుచింతలపల్లి గ్రామస్థుడు రామిరెడ్డి తెలిపారు. 2006కు మునుపు పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటలను సాగు చేస్తూ సాఫీగా జీవనం కొనసాగించామని.. కర్మాగారం ఏర్పాటైన తర్వాత పంటలే పండటం లేదని శివరామిరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. భూమి పొరల్లో రసాయన వ్యర్థాలు చేరడంతో మొత్తంగా సాగే కుదేలైందన్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పడిపోయాయి. భూములను అమ్ముకుందామన్నా కొనేందుకు ఎవరూ రావడం లేదన్నారు. ఎకరా రూ.50వేలకు కూడా భూములను కొనే పరిస్థితి లేదు. వ్యర్థాలు వెదజల్లే కాలుష్యంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో చాలా మంది మూత్రపిండాల వ్యాఽధులు, ఊపిరితిత్తుల క్యేన్సర్‌కు గురై రోజులు లెక్కపెడుతున్నారు. ఇక్కడ తాగునీటి సౌకర్యం కోసం చిత్రావతి నుంచి పైపులైన్‌ ద్వారా నీళ్లందించే ప్రక్రియ సజావుగా సాగడం లేదు. మూత్ర పిండాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని వైఎ్‌సఆర్‌ కడప జిల్లా రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేసిన రామ్‌కిషన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.

‘ఆంధ్రజ్యోతి’ని అడ్డుకున్న వైసీపీ నేత
తుమ్మలపల్లిలోని యురేనియం ప్లాంట్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ నాగర్‌కర్నూలు జిల్లా బృందాన్ని వైసీపీ నాయకుడు ఆనందులరెడ్డి అడ్డుకున్నారు. యూనిట్‌లో పనిచేస్తున్న ఆయన అక్కడికి ఎవరూ రావడానికి అనుమతి లేదని, ‘ఆంధ్రజ్యోతి’ విలేకరులు ఎందుకు వచ్చారని దురుసుగా ప్రవర్తించారు. కెమెరాలోని ఫొటోలను తీసివేయించారు. వెనుతిరిగిన విలేకరుల వాహనం వెనుక సుమారు 8 కిలోమీటర్ల వరకు అనుసరించారు.

అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగడం లేదు
యురేనియం ప్రాజెక్టు నెలకొల్పిన తర్వాత వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడం, భూముల విలువ పడిపోవడం, ప్రజలకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో స్థానిక యువకులకు పెళ్లి సంబంధాలు కుదరడం సమస్యగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు తెలిసి చాలామంది ఇక్కడి ఊర్లకు తమ అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటున్నారు.

పస్తులుంటున్నం
యురేనియం ఫ్యాక్టరీ తెచ్చి మమ్ముల పస్తుల్లోకి నెట్టినారు. ప్రాజెక్టు రాకముందు కూలి పనులతో సంసారం గడిచేది. ఇప్పుడు ఏడాదిలో నెల రోజులే కూలి పని దొరుకుతోంది. అది కూడా రోజుకు రూ.100 ఇస్తున్నారు.. ఇట్లయితే మేం ఎట్ల బతికేది?
- రమాదేవి, కూలీ, తుమ్మలపల్లి

నీళ్లు గొంతులో పోసుకోలేం
మా ఊర్లో నీళ్ళు తాగడానికి పనికి రావు. ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒంటి మీద దురద, దద్దుర్లు వస్తున్నాయి. తాగేనీళ్లను 30కిలోమీటర్ల దూరంలోని తార్ణపల్లికి నుంచి సరఫరా చేస్తున్నరు. ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారు.
- పురుషోత్తం రెడ్డి, నిరుద్యోగి, తుమ్మలపల్లి
మా జీవితాలు సర్వనాశనం
ఒకప్పుడు బాగా బతికినోళ్లమే. యురేనియం ప్రాజెక్టుతో మా జీవితాలే సర్వనాశనమయ్యాయి. మునుపు బోరువేస్తే 90 ఫీట్లకే నీళ్లు పడేవి. ఇప్పుడేమో 500 ఫీట్లు వేసినా చుక్కనీళ్లు రావడం లేదు. నేను రెండు బోర్లు వేసిన. నీళ్లు రాలేదు. భూములను అమ్ముకుందామనుకున్నా కొనే దిక్కులేరు.
- శివరామిరెడ్డి, రైతు, తుమ్మలపల్లి

యురేనియం తవ్వకాన్ని అనుమతించం! - KCR

యురేనియం తవ్వకాన్ని  అనుమతించం! - KCR
16-09-2019 02:58:51

యురేనియం తవ్వకాన్ని అడ్డుకుంటాం
నల్లమలను నాశనం కానివ్వం: కేసీఆర్‌
కేంద్రంతో కొట్లాడదాం.. పోరాటం చేద్దాం
తవ్వకాలతో కృష్ణా నది కలుషితం
హైదరాబాద్‌ తాగునీటికీ ప్రమాదం
సాగర్‌, శ్రీశైలం, పులిచింతల సహా డెల్టా ప్రాంతమూ నాశనం: సీఎం
కేంద్ర సర్కారుకు దురుద్దేశం లేదు
మనం అణ్వస్త్రాలు సమకూర్చుకోవాలి
దేశ రక్షణలో రాజీ పడకూడదు
యురేనియం ఉందని తేలినా తవ్వకాలను అనుమతించం: కేటీఆర్‌
వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న భట్టి
అంగీకరించిన ముఖ్యమంత్రి
రేపు శాసనసభ, మండలిలో తీర్మానం
భట్టిపై పరుషంగా మాట్లాడా.. విచారిస్తున్నా..
గోదావరిపై కట్టిన, కడుతున్న ప్రాజెక్టుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ 570 టీఎంసీల నీటిని తీసుకుంటాం. కాళేశ్వరంపై అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకోం. మల్లు భట్టి విక్రమార్కపై పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. దానిపై విచారం వ్యక్తం చేస్తున్నా. మేమేమీ దేవుడి కొడుకులం కాదు. ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకుంటాం.
ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


Supermoon - Ft. Russell Peters World Tour.
Pune | Ahmedabad | Hyderabad Oct 1st - Oct 6th
Book Now
-సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎవరికీ ఏ విధమైన అనుమతులూ ఇవ్వలేదని, భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ఆదివారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన యురేనియం తవ్వకాలపై మాట్లాడారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వం. యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం పట్టుబడితే వ్యతిరేకంగా కొట్లాడదాం. పోరాటం చేద్దాం’’ అని కేసీఆర్‌ అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భట్టి విక్రమార్క సూచించగా.. సీఎం అంగీకరించారు. మంగళవారం శాసనసభ, మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఎస్‌కే జోషిని ఆయన ఆదేశించారు. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని చెప్పినా.. 2009లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో యురేనియం తవ్వకాలు చేపట్టారని, ఆ ప్రాంతమంతా కలుషితమవుతోందంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని చెప్పారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల రైతాంగానికి అన్నం పెట్టే కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, సాగర్‌, పులిచింతలతో పాటు డెల్టా ప్రాంతమంతా కలుషితమై నాశనమయ్యే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నుంచి హైదరాబాద్‌కు వచ్చే తాగునీరు కూడా కలుషితమవుతుందన్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోమని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.

అమ్రాబాద్‌లో అన్వేషణ జరగలేదు: కేటీఆర్‌
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌(ఏఎండీ) యురేనియం అన్వేషణ చేపట్టలేదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నల్లమలలోని 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు 2009లో జీవో నంబరు 127 ద్వారా అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో యురేనియం తవ్వకాలపై సభ్యులడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో యురేనియం అన్వేషణకు మాత్రమే అనుమతి ఇవ్వాలని 2016లో రాష్ట్ర వన్యప్రాణి మండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని తెలిపారు. ఒకవేళ యురేనియం ఉందని తేలితే తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దనే షరతును విధించిందని పేర్కొన్నారు. 1999లో ఎంపీగా ఉన్నప్పుడు ఏఎండీ ప్రతినిధులు తన ను కలిశారని, లంబాపూర్‌, పెద్దగట్టు గ్రామాల రైతులను ఛత్తీ్‌సగఢ్‌లోని యురేనియం ప్రాజెక్టుకు తీసుకెళ్లారని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. నల్లగొండ జిల్లాలోని లంబాపూర్‌, పెద్దగట్టు, చింత్రియాల్‌లలో 1992-2012 మధ్య కాలంలో యురేనియం అన్వేషణ కోసం ఏఎండీ సర్వే చేసిందని తెలిపారు.

సుమారు 18,550 మెట్రిక్‌ టన్నుల యురేనియం నిక్షేపాలున్నాయని గుర్తించారని కేటీఆర్‌ వెల్లడించారు. ‘‘యురేనియాన్ని విద్యుత్తు శక్తికే వాడరు. అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారు. అంతరిక్ష ప్రయోగాలకు ఇంధనంగా వాడతారు. కేంద్ర ప్రభుత్వం చెడు ఉద్దేశంతో యురేనియం అన్వేషణకు అనుమతి ఇవ్వలేదు. దేశంలో అంతరిక్ష పరిశోధనలు జరగాలి. మనం అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి. భారతదేశ రక్షణలో రాజీలేకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది’’ అని కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పర్యావరణ ప్రేమికుడని, యురేనియం తవ్వకాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ తవ్వకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు నల్లమలకు వెళ్లి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా లేనిపోని వార్తలు రాస్తున్నాయని చెప్పారు. ఇది నీచం, అత్యంత బాధ్యతారాహిత్యమని కేటీఆర్‌ విమర్శించారు. ఓ పత్రికలో యురేనియం తవ్వకాలు జరిగిపోయినట్లు, కోటి మంది ప్రజలున్న హైదరాబాద్‌కు ముప్పు వాటిల్లుతున్నట్లు రాశారని.. ఇలాంటి సున్నితమైన వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. యురేనియం వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాగా.. ఇప్పుడు అన్వేషణ చేస్తోంది బీజేపీ సర్కారు అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. కాగా, తవ్వకాలు వద్దన్నప్పుడు అన్వేషణ ఎందుకని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. యురేనియం అన్వేషణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

Monday, September 2, 2019

యురేనియం తవ్వకాలతో రెండు రాష్ట్రాలకు ముప్పే... విశ్రాంత సీనియర్‌ సైంటిస్ట్‌ కె. బాబురావు

యురేనియం తవ్వకాలతో రెండు రాష్ట్రాలకు ముప్పే...
03-09-2019 08:45:39

నల్లమల అడవులు నాశనమే
కృష్ణా జలాలు విషమయం
ఆ నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు
దీన్ని తెలుగు ప్రజలంతా వ్యతిరేకించాలి : సీనియర్‌ శాస్త్రవేత్త కె. బాబురావు
యురేనియం కోసం నల్లమల అడవుల్లో తవ్వకాలు చేపడితే పర్యావరణానికి ముప్పు తప్పదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ, విశ్రాంత సీనియర్‌ సైంటిస్ట్‌ కె. బాబురావు హెచ్చరిస్తున్నారు. కృష్ణా జలాలు విషతుల్యం అవుతాయని, ఆ నీటిని తాగితే మూత్ర పిండాలకు ముప్పేనని, ఊపిరితిత్తుల కేన్సర్‌ వంటి మరెన్నో ఆరోగ్య సమ్యలు తలెత్తుతాయని అంటున్నారు. ‘‘బహుజన బతుకమ్మ’’ నినాదంతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ‘‘యురేనియం తవ్వకాలు - ప్రకృతి విధ్వంసాలు’’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావును ఆంధ్రజ్యోతి పలకరించగా.. ఆయన చెప్పిన వివరాలు తన మాటల్లోనే.

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి):
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు మొదలైతే, నగర వాసులకు ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి?
ప్రకృతి సరిగా ఉంటేనే హాయిగా జీవించగలం అనే నిజాన్ని పట్టణ వాసులు గుర్తించాలి. నల్లమలలో యురేనియం కోసం తవ్వితే ప్రజలకు ప్రాణవాయువు అయిన అడవులు నాశనమవుతాయి. దాంతో వాతావరణ అసమతుల్యత ఏర్పడుతుంది. సకాలంలో వర్షాలు పడవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భూమిలోని యురేనియంను వెలికితీసి, దాన్ని శుద్ధి చేసే క్రమంలో ఆ రసాయన వ్యర్థాలన్నీ కృష్ణానదిలో కలుస్తాయి. దీంతో నదీజలాలు కలుషితమవుతాయి. అలా జరిగితే హైదరాబాద్‌ వాసులు ఆ యురేనియం కలిసిన నీళ్లే రోజూ తాగాల్సివస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ హైదరాబాదీయులు కదం తొక్కాలి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారా ?
2005లో పెద్దగట్టు, లంబాపూర్‌ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ అందుకు అనుమతి కూడా ఇచ్చింది. ‘యురేనియం అంటూ తవ్వితే నగరానికి సరఫరా అయ్యే నీటి నాణ్యతను మేం కాపాడలేం’ అని ఆనాడు హైదరాబాద్‌ జలమండలి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాలే కాదు, నల్లమలలోనూ తవ్వుతారట. యురేనియం కోసం విస్తృతంగా తవ్వకాలు చేపడితే ప్రజారోగ్యం, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వ్యతిరేకించాలి.

యురేనియం తవ్వకాల వెనుక దాగున్న అసలు ఉద్దేశాలు ఏంటి ?
యురేనియం తవ్వకాల వెనుక యుద్ధోన్మాద కాంక్షే కనిపిస్తుంది. రాజకీయ మనుగడ ఎప్పుడూ బలం ఆధారంగా సాగుతుంది. ‘‘మేము భారతదేశాన్ని చాలా బలవంతమైన దేశంగా తయారుచేశాను. మా వద్ద బాంబులున్నాయి’ అని పాలకులు చాటుకోవడం కోసమే అని నా అభిప్రాయం. దానివల్ల ప్రయోజనం శూన్యం. యురేనియంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసినా, దాని నుంచి వచ్చిన మిగిలిన వ్యర్థాలను బాంబుల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా చాలామంది శాస్త్రవేత్తలు ‘‘అణువిద్యుత్‌ను ఆపకుండా, అణుబాంబులను ఆపలేమని’’ చెబుతున్నారు. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు అణుశక్తి లేకుండానే బాంబు తయారు చేసుకోలేదా అని భారత అణుశక్తి సంస్థ చెబుతుంది. అణుశక్తితో తయారుచేయడం సులువైన విధానం. ఖర్చు కూడా చాలా తక్కువ. అది యురేనియం రూపంలో రెడీమేడ్‌గా దొరుకుతుంది. అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తే వాటి నుంచి కావాల్సినన్ని బాంబులు తయారుచేసుకోవచ్చు.

యురేనియం తవ్వకాలతో నష్టపోయిన దేశాలు?
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్‌ తదితర దేశాల్లో యురేనియం తవ్వకాలు జరిగాయి. తవ్వకాలతో ప్రమాదానికి గురికాని దేశం లేదు. అమెరికా, న్యూమెక్సికో రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు జరిపారు. కొన్నాళ్ల తర్వాత ఆ ప్రాంతంలో ఊపిరితిత్తుల కేన్సర్‌, సిలికోసిస్‌ వ్యాధులతో మరణాలు పెరిగాయి. చర్చిరాక్‌ ప్రాంతంలో యురేనియం వ్యర్థాలు నిల్వచేసిన చెరువు కట్టలు తెగి, రియో పువర్కో నదిలో కలిశాయి. ఆ నీళ్లన్నీ వృథా అయ్యాయి. అందులోని జీవులన్నీ మరణించాయి. ఆ ప్రాంతమంతా బొందల గడ్డగా మారింది. ఇలాంటి ఉదాహరణలు మరెన్నో.

భూమిలో నుంచి తీసిన యురేనియంను శుద్ధి చేసేందుకు అనువైన వ్యవస్థ మనవద్ద ఉందంటారా ?
ముడి ఖనిజం శుద్ధి చేసి యురేనియం తీసే యంత్రాంగం మన వద్ద ఉంది. రియాక్టర్ల నుంచి వాడేసిన ఇంథనం (స్పెంట్‌ ఫియల్‌ను), అందులోని అణుధార్మిక పదార్థాలను తొలగించి, వాటిని ప్రమాద రహితంగా చేసి నిక్షిప్తం చేసే వ్యవస్థ మన వద్ద లేదు. ఆ వ్యర్థాలలోని ఫ్లుటోనియంను తీసి బాంబుల తయారీలో వాడతారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు ఒక ప్రాంతంలోనే చేపట్టడం లేదు. రెండుచోట్ల 38 చ.కి.మీ, మరో ప్రాంతంలో నాలుగు చ.కి.మీ, ఇంకో చోట మూడు చ.కి.మీ. తవ్వుతున్నారు. దాంతో అక్కడ తవ్విన ముడి ఖనిజాన్ని శుద్ధి కర్మాగారానికి సరఫరా చేసే క్రమంలో నల్లమల అడవి అంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. రవాణా సమయంలో ఏర్పడే వాహనాల రొదతో చాలా జీవరాశులు పారిపోతాయి. జంతువులు లేని అడవి అడవి కాదు.

కడప జిల్లా తుమ్మలపల్లి పరిసరాల్లో ప్రస్తుతం నెలకొన్న పర్యావరణ, ప్రజారోగ్య పరిస్థితి గురించి...?
యురేనియం కార్పొరేషన్‌ కంపెనీల నిర్వాకం భయంకరం. కడపలో వాళ్లు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. సరైన నియంత్రణ వ్యవస్థే లేదు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలికి నోటీసు ఇస్తే.. మాకు సంబంధం లేదంటారు. యురేనియం కంపెనీ ప్రారంభమైన చోట, 33 శాతం విస్తీర్ణంలో మొక్కలు పెంచాలనేది నిబంధన. ఒక్క మొక్క కూడా నాటని వైనం ఆ కంపెనీది. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి, తమ్ముడిని అక్కడ కూర్చోబెట్టి, ప్రజల నోళ్లు మూయించి సొంత నియోజకవర్గంలో యురేనియం తవ్వకాలకు అనుమతించారు. ప్రస్తుతం అక్కడ చాలా గ్రామాల వాళ్లు తీవ్ర నష్టాన్ని అనుభవిస్తున్నారు. నీళ్లు వ్యవసాయానికి యోగ్యం కావని, ఆ నేలలో పంటలు పండవని శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని ఊళ్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అక్కడి గనిలో పనిచేసే కార్మికులు చాలామంది పురుషులు నపుంసకత్వానికి గురయ్యారు.

   2016, డిసెంబర్‌లో చెన్నై రీజనల్‌ ఆఫీసు, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుడు యురేనియం కంపెనీ నిర్వహణ తీరును పరిశీలించాడు. అందులో తేలిన అంశాలతో 2017, జనవరిలో ఒక రిపోర్టు తయారు చేశాడు. పర్యావరణ అనుమతిలోని తొమ్మిది నిబంధనలల్లోని ఒక్కటి కూడా యురేనియం కంపెనీ పాటించలేదు. ఇన్నేళ్లుగా వాళ్ల నిర్వాకంపై చర్యలు తీసుకోలేదు. సమస్య తీవ్రతను తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌కు లేఖ రాశాను. దానిపై వాళ్ల నుంచి స్పందన లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ?
యురేనియం తవ్వకాల వల్ల రాడాన్‌ అనే అణుధార్మిక వాయువు వెలువడుతుంది. ఆ గాలి పీల్చిన వారు ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. యురేనియం వ్యర్థాలు కలిసిన నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు పుట్టే అవకాశం ఉండకపోవచ్చు.