యురేనియం తవ్వకాన్ని అనుమతించం! - KCR
16-09-2019 02:58:51
యురేనియం తవ్వకాన్ని అడ్డుకుంటాం
నల్లమలను నాశనం కానివ్వం: కేసీఆర్
కేంద్రంతో కొట్లాడదాం.. పోరాటం చేద్దాం
తవ్వకాలతో కృష్ణా నది కలుషితం
హైదరాబాద్ తాగునీటికీ ప్రమాదం
సాగర్, శ్రీశైలం, పులిచింతల సహా డెల్టా ప్రాంతమూ నాశనం: సీఎం
కేంద్ర సర్కారుకు దురుద్దేశం లేదు
మనం అణ్వస్త్రాలు సమకూర్చుకోవాలి
దేశ రక్షణలో రాజీ పడకూడదు
యురేనియం ఉందని తేలినా తవ్వకాలను అనుమతించం: కేటీఆర్
వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న భట్టి
అంగీకరించిన ముఖ్యమంత్రి
రేపు శాసనసభ, మండలిలో తీర్మానం
భట్టిపై పరుషంగా మాట్లాడా.. విచారిస్తున్నా..
గోదావరిపై కట్టిన, కడుతున్న ప్రాజెక్టుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ 570 టీఎంసీల నీటిని తీసుకుంటాం. కాళేశ్వరంపై అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకోం. మల్లు భట్టి విక్రమార్కపై పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. దానిపై విచారం వ్యక్తం చేస్తున్నా. మేమేమీ దేవుడి కొడుకులం కాదు. ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకుంటాం.
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
Supermoon - Ft. Russell Peters World Tour.
Pune | Ahmedabad | Hyderabad Oct 1st - Oct 6th
Book Now
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎవరికీ ఏ విధమైన అనుమతులూ ఇవ్వలేదని, భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ఆదివారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన యురేనియం తవ్వకాలపై మాట్లాడారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వం. యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం పట్టుబడితే వ్యతిరేకంగా కొట్లాడదాం. పోరాటం చేద్దాం’’ అని కేసీఆర్ అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భట్టి విక్రమార్క సూచించగా.. సీఎం అంగీకరించారు. మంగళవారం శాసనసభ, మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎస్‌కే జోషిని ఆయన ఆదేశించారు. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని చెప్పినా.. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో యురేనియం తవ్వకాలు చేపట్టారని, ఆ ప్రాంతమంతా కలుషితమవుతోందంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని చెప్పారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల రైతాంగానికి అన్నం పెట్టే కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, సాగర్, పులిచింతలతో పాటు డెల్టా ప్రాంతమంతా కలుషితమై నాశనమయ్యే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నుంచి హైదరాబాద్‌కు వచ్చే తాగునీరు కూడా కలుషితమవుతుందన్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోమని కేసీఆర్ తేల్చిచెప్పారు.
అమ్రాబాద్‌లో అన్వేషణ జరగలేదు: కేటీఆర్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్(ఏఎండీ) యురేనియం అన్వేషణ చేపట్టలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లమలలోని 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు 2009లో జీవో నంబరు 127 ద్వారా అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో యురేనియం తవ్వకాలపై సభ్యులడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం అన్వేషణకు మాత్రమే అనుమతి ఇవ్వాలని 2016లో రాష్ట్ర వన్యప్రాణి మండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని తెలిపారు. ఒకవేళ యురేనియం ఉందని తేలితే తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దనే షరతును విధించిందని పేర్కొన్నారు. 1999లో ఎంపీగా ఉన్నప్పుడు ఏఎండీ ప్రతినిధులు తన ను కలిశారని, లంబాపూర్, పెద్దగట్టు గ్రామాల రైతులను ఛత్తీ్‌సగఢ్‌లోని యురేనియం ప్రాజెక్టుకు తీసుకెళ్లారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. నల్లగొండ జిల్లాలోని లంబాపూర్, పెద్దగట్టు, చింత్రియాల్‌లలో 1992-2012 మధ్య కాలంలో యురేనియం అన్వేషణ కోసం ఏఎండీ సర్వే చేసిందని తెలిపారు.
సుమారు 18,550 మెట్రిక్ టన్నుల యురేనియం నిక్షేపాలున్నాయని గుర్తించారని కేటీఆర్ వెల్లడించారు. ‘‘యురేనియాన్ని విద్యుత్తు శక్తికే వాడరు. అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారు. అంతరిక్ష ప్రయోగాలకు ఇంధనంగా వాడతారు. కేంద్ర ప్రభుత్వం చెడు ఉద్దేశంతో యురేనియం అన్వేషణకు అనుమతి ఇవ్వలేదు. దేశంలో అంతరిక్ష పరిశోధనలు జరగాలి. మనం అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి. భారతదేశ రక్షణలో రాజీలేకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది’’ అని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడని, యురేనియం తవ్వకాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ తవ్వకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు నల్లమలకు వెళ్లి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా లేనిపోని వార్తలు రాస్తున్నాయని చెప్పారు. ఇది నీచం, అత్యంత బాధ్యతారాహిత్యమని కేటీఆర్ విమర్శించారు. ఓ పత్రికలో యురేనియం తవ్వకాలు జరిగిపోయినట్లు, కోటి మంది ప్రజలున్న హైదరాబాద్‌కు ముప్పు వాటిల్లుతున్నట్లు రాశారని.. ఇలాంటి సున్నితమైన వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. యురేనియం వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాగా.. ఇప్పుడు అన్వేషణ చేస్తోంది బీజేపీ సర్కారు అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. కాగా, తవ్వకాలు వద్దన్నప్పుడు అన్వేషణ ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. యురేనియం అన్వేషణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment