నల్లగొండలో యురేనియం తవ్వకాలు..?
firstbulletin
హైదరాబాద్: రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో యురేనియం నిల్వలున్నప్పటికీ త్రవ్వకాలకు కేంద్రప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. దాంతో గనుల తవ్వకాలకు రంగం సిద్ధమైంది. ఐతే మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం కాదు, నల్లగొండ జిల్లాలో మైనింగ్ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో మైనింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ యురేనియం నిల్వలను వెలికి తీయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి పర్యావరణ అనుమతిని (ఈసీ) కూడా జారీ చేసింది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఆధ్వర్యంలో ఈ మైనింగ్‌ను నిర్వహించనున్నారు. నేషనల్ న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎ్‌ఫసీ) అవసరాల కోసం ‘ఎల్లో ప్లేట్ల’ రూపంలో ఈ యురేనియం నిల్వలను వెలికి తీయాలని నిర్ణయించారు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొత్తగా 13 యురేనియం ప్రాజెక్టులను చేపట్టడానికి వీలుగా ఆటమిక్ ఎనర్జీ కమిషన్ (ఏఈసీ) ఈ మధ్య అనుమతిని జారీ చేసింది. అందులో మన రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలోని లంబాపూర్ యురేనియం గనులు కూడా ఉన్నాయి. నాగార్జుననగర్ నియోజకవర్గం పరిధిలోని లంబాపూర్, పులిచర్ల, నామాపూరం, ఎల్లాపురం గ్రామాల పరిధిలో ఈ యురేనియం గనులు ఉన్నట్టు గుర్తించారు.
మొత్తం 542 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఈ గ నుల్లో సుమారు 18,550 మెట్రిక్ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. ఈ నిల్వలను వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే పర్యావరణ అనుమతిని జారీ చేశారు. ప్రస్తుతం భూ సేకరణ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ యురేనియం గనుల నిర్వహణ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాయల్టీ కింద కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ గనులకు సంబంధించిన సమాచారాన్ని.. ఈ గనుల తవ్వకం మొత్తం 7 సంవత్సరాల పాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. గనుల నిర్వహణలో అన్ని రక్షణ చర్యలనూ పాటించడంతో పాటు, పర్యావరణానికి సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు.

No comments:
Post a Comment