అరణ్య వేదన!
16-07-2019 02:33:13
https://www.andhrajyothy.com/artical?SID=848094
స్మగ్లర్ల వేటుకు కూలుతున్న వృక్షాలు
సరిహద్దు రాష్ట్రాలకు అక్రమ రవాణా
కృష్ణా, గోదావరి నదుల గుండా స్మగ్లింగ్
గిరిజనుల ముసుగులో చెరబట్టే నేతలు
పోడు పేరుతో నాయకుల పాడు పని
ఉన్న అడవిని నరికి హరితహారం
అటవీ శాఖాధికారుల వింత పోకడ
మామూళ్ల మత్తులో స్మగ్లింగ్‌కు దారి
మైదానాలుగా మారుతున్న అడవులు
గత పదేళ్లలోనే 20 శాతం క్షీణత
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతోంది! కానీ, పచ్చదనానికి నిలయమైన అడవులు మాయమవుతున్నాయి! రాష్ట్రంలో మొక్కలు నాటుతున్నారు! కానీ, గొడ్డలి వేటుకు విలువైన భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి! హరితహారం పేరిట పచ్చదనం పెంచుతున్నారు! కానీ, అదే హరితహారం పేరు చెప్పి అడవులు నరికేస్తున్నారు! మా పోడు భూములు లాక్కుంటారా అని గిరిజనులు ఉద్యమిస్తున్నారు. కానీ, పోడు భూముల్లోనూ మొక్కలు నాటుతూ అడవిని పెంచుతున్నామని అటవీ శాఖ చెబుతోంది. వెరసి, పదేళ్లలోనే 20ు అడవులు క్షీణించాయి. దట్టమైన అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు 4.15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండగా.. ప్రస్తుతం 1.83 లక్షల హెక్టార్లకే పరిమితమైందని స్వయంగా అధికారుల లెక్కలే చెబుతున్నాయి. అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భుపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర నష్టం జరుగుతోంది. ‘‘రాష్ట్రంలో 24 ు అటవీ విస్తీర్ణమున్నట్లు గణాంకాల్లో చూపెడుతున్నారు. వాస్తవానికి, 12 శాతానికి మించి లేదు. సహజంగా పెరిగే అడవిని కాపాడుకోవాలి. లేకపోతే, హరితహారం వంటి కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా ఉపయోగం ఉండదు. స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలి. చెట్లు నరికితే ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు. టీఆర్‌ఎస్ కార్యకర్తలైనా చర్యలు తీసుకోవాలి. అటవీ చట్టాలను మార్చాలి. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించాలి’’ అని ఆరు నెలల కిందట అటవీ శాఖ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి! గిరిజనులను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నాయకులు సహా అన్ని పార్టీల నేతలూ అడవులను మింగేస్తున్నారు. పోడు భూముల పేరిట పట్టాలు సృష్టిస్తున్నారు. మరోవైపు, వీరప్పన్ వారసులు అడవిని చెరబడుతున్నారు. వారికి కొందరు అటవీ అధికారులే వంత పాడుతున్నారు.
ADVERTISEMENT
Learn More
POWERED BY PLAYSTREAM
స్మగ్లర్ల కత్తి వేటుకు..!
కలప స్మగ్లర్ల దెబ్బకు అడవి క్షీణిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో సుమారు 2.75 లక్షల హెక్టార్లలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి టేకు, జిత్తరేగి, నారవేప చెట్లను యథేచ్ఛగా నరికేస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నల్లమల అటవీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. ముంబై, చెన్నై ప్రాంతాలకు చెందిన కలప స్మగ్లర్లు ఇక్కడ దందాకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మండలాలైన బజార్‌హత్నూర్, బోథ్‌ల్లో అడ్డంగా నరికేస్తున్నారు. మహారాష్ట్ర ముల్తానీలు సరిహద్దు అడవుల్లో రెచ్చిపోతున్నారు. ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ముల్తానీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు లేదు. సిరికొండ మండలం కేశవపట్నం, గుండాల, సిరిచెల్మ, ఎల్లమ్మగూడ, జోగిపేట తదితర గ్రామాలకు చెందిన కొందరు స్మగ్లర్ల అవతారమెత్తారు. వారికి అటవీ అధికారులు ఉపాధి కల్పించినా నరికివేత ఆగడం లేదు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ, పిట్లం, జుక్కల్, గాంధారి, కామారెడ్డి పరిధిలో స్థానిక తండావాసులను మచ్చిక చేసుకుని అక్రమంగా కలపను తరలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులను కలప దందాకు ఉపయోగిస్తున్నారు. ఇక, కొందరు స్మగ్లర్లు పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తుంటే.. మరికొందరు బొగ్గు బట్టీలకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతోంది. స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు పలుమార్లు ప్రకటించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు.
అక్కడ కృష్ణా.. ఇక్కడ గోదావరి!
కృష్ణా, గోదావరి నదులను స్మగ్లర్లు కలప రవాణాకు ఉపయోగిస్తున్నారు. నల్లమల నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతం గుండా పుట్టీల్లో పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి గోదావరి నది గుండా కలపను అక్రమ రవాణా చేస్తున్నారు.
పోడు పేరిట పాడు పని
అడవి బిడ్డలైన గిరిజనులకు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకునే హక్కుంది. దీనినే అడ్డు పెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు అడవులను చెరబడుతున్నారు. తొలుత గిరిజనులతో అడవులను నరికిస్తున్నారు. ఆ గిరిజనులకే దానిని కౌలుకు ఇస్తున్నారు. దాంతో, అటు కౌలూ దక్కుతోంది. ఇటు ప్రభుత్వ పథకాలూ చిక్కుతున్నాయి. ఇక, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోడు వ్యవసాయం కోసం అడవులను ధ్వంసం చేస్తున్నారు. వామపక్ష పార్టీల మద్దతు, రాజకీయ ఆధిపత్య పోరుతో ఇక్కడ పోడు నానాటికీ పెరుగుతోంది.
హరితహారం పేరుతో..!
హరిత హారం లక్ష్యాలను చేరుకోవడానికి కొందరు అటవీ శాఖాధికారులు ఉన్న అడవిలోని భారీ వృక్షాలను నరికేసి మొక్కలు నాటుతున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. హరిత హారం అమలు బాధ్యతను ప్రభుత్వం అటవీ శాఖకే అప్పగించింది. లక్ష్యాలను అధిగమించడానికి అడవిని పెంచాలి. కానీ, కొందరు అధికారులు అడవుల్లోని చెట్లను నరికేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
మామూళ్ల మత్తులో అధికారులు
కలప స్మగ్లింగ్, అక్రమంగా పోడు సాగు అటవీ అధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలు చాలా బలంగానే ఉన్నాయి. కలప స్మగ్లర్లతో అంటకాగిన ఇచ్చోడ సీఐ సతీశ్‌తోపాటు నేరడిగొండ ఎస్సై హరిశేఖర్‌పైనా ఇటీవల వేటు పడింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఐదుగురు అటవీ అధికారులను సస్పెండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది అటవీ అధికారులపై కేసులు నమోదు చేశారు. లాభాలు ఆర్జించి పెట్టే కలప స్మగ్లింగ్‌లో రాజకీయ జోక్యం కూడా పెరుగుతోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన కలప కోత మిల్లుల యజమానులు ఈ దందాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
5 కోట్ల కలప స్వాధీనం
ఐదేళ్లలో అటవీ శాఖ 55 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుంది. గత ఏడాది సుమారు రూ.10 కోట్ల విలువైన కలపను అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. అలాగే, 2017లో 9.82 కోట్లు, 2016లో 11.61 కోట్లు, 2015లో రూ.18 కోట్ల కలపను స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి
అడవులను సంరక్షించాలంటే పోలీస్ స్టేషన్ల మాదిరిగా ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. ఒక్కో స్టేషన్‌లో 15-20 మంది సిబ్బంది ఉండాలి. వారికి శిక్షణతోపాటు ఆయుధాలను ఇవ్వాలి. నేర నియంత్రణకు పోలీసులు వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతను అటవీ సంరక్షణకు ఉపయోగించాలి. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించాలి. సిబ్బందికి ప్రాణ రక్షణ కల్పించాలి. విధి నిర్వహణలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. - కొట్టే శేఖర్, అటవీ ఉద్యోగుల సంఘం

No comments:
Post a Comment