పెద్ద పులులు @ 26!
30-07-2019 02:20:57
తెలంగాణలో స్వల్పంగా పెరుగుదల
ఏపీలో యథాతథంగా సంఖ్య.. తెలంగాణలో నాలుగేళ్లలో అదనంగా ఆరు
అటవీ సంరక్షణ చర్యల వల్లే: ఇంద్రకరణ్.. దేశవ్యాప్తంగా 2,967 పులులు
తొలి మూడు స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్
జాతీయ పులుల సంరక్షణ మండలి నివేదిక
న్యూఢిల్లీ, హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పెద్ద పులులు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ వాటి సంఖ్య స్వల్పంగా పెరిగింది. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల్లో మొత్తం 26 పెద్ద పులులు ఉన్నట్లు జాతీయ పులుల సంరక్షణ మండలి (ఎన్టీసీఏ) తన నివేదికలో తెలిపింది. తెలంగాణలో దాదాపు 23-30 మధ్యలో పెద్ద పులులు ఉండొచ్చని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పులుల సంఖ్యపై ఎన్టీసీఏ సర్వే చేసింది. జూలై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఎన్టీసీఏ జాతీయ పులుల నివేదిక- 2018ను సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీ విడుదల చేశారు. 2014లో చేసిన సర్వే ప్రకారం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 17, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 3 చొప్పున తెలంగాణలో మొత్తం 20 పెద్ద పులులు ఉన్నాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఆ సంఖ్య 26కు చేరింది.
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
ఏపీలో అంతే.. తెలంగాణలో పెరుగుదల
పుష్కర కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు కూడా ఏపీలో వాటి సంఖ్య యథాతథంగా ఉండగా, తెలంగాణలో కాస్త పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్త సర్వేలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006, 2010, 2014ల్లో పులుల సంఖ్యను లెక్కించారు. ఉమ్మడి ఏపీలో 2006లో 95, 2010లో 72, 2014లో 68 పెద్ద పులులు ఉన్నట్లు తేల్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పులుల సర్వే నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా నివేదిక ప్రకారం ఏపీ (48), తెలంగాణ (26)లో కలిపి 74 పులులు ఉన్నాయి. ఏపీలో పులుల సంఖ్య యథావిథిగా ఉండగా.. తెలంగాణలో కాస్త పెరిగింది. కాగా, పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటకతో పోలిస్తే.. తెలంగాణలో పెరుగుదల చాలా తక్కువగా ఉంది. మహారాష్ట్రలో 2014లో 190 పులులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 312కు చేరింది. కర్ణాటకలోనూ 406 నుంచి 524కు పెరిగాయి.
మన టైగర్ రిజర్వ్‌లు ‘గుడ్’!
పెద్ద పులులు జీవించడానికి కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారె్‌స్టలు అనువైనవిగా నివేదిక తెలిపింది. అయినా, ఇక్కడ పులుల సంరక్షణకు పలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అమ్రాబాద్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కలుషితం కాని రెండు భారీ రిజర్వాయర్లు ఏర్పాటు చేశారని కొనియాడింది కానీ, ఇక్కడ అక్రమంగా చేపలు పట్టడం, పెద్ద సంఖ్యలో చెంచు తండాలు, సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల రద్దీ, జల విద్యుత్తు ప్రాజెక్టు, హైవోల్టేజీ విద్యుత్తు ప్రాజెక్టు వంటి ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. వివిధ స్థాయుల్లో 567 మంది అధికారులు అవసరముండగా 97 మందే ఉన్నారని తప్పుబట్టింది. పునరావాస, వైపరీత్య నివారణ వ్యూహాలు సరైన స్థాయిలో లేవని, సుశిక్షిత సిబ్బంది కూడా లేరని ఆందోళన వ్యక్తం చేసింది.
సమీపంలోని ఆలయాలకు వచ్చే భక్తులు, వారి వాహనాలతో వన్యప్రాణి ప్రశాంతతకు భంగం వాటిల్లుతోందని తెలిపింది. కవ్వాల్‌లోనూ సిబ్బంది కొరత ఉందని, ప్రపంచ బ్యాంకు ఏర్పరిచిన వన సంరక్షణ సమితులు క్రియాశీలంగా లేవని, వాహనాల రద్దీ వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొంది. దేశంలోని టైగర్ రిజర్వ్‌లకు రక్షణ చర్యల ఆధారంగా ఫెయిర్, గుడ్, వెరీగుడ్ పేరిట రేటింగ్ ఇచ్చింది. అయినా అమ్రాబాద్ (71%), కవ్వాల్ (61%) ‘గుడ్’ రేటింగ్ సాధించాయి. కాగా, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లకు మహారాష్ట్ర నుంచి పులులు అధికంగా వలస వస్తున్నాయి.
అటవీ సంరక్షణ చర్యల వల్లే: అల్లోల
తెలంగాణలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ చేపట్టిన సంరక్షణ చర్యలే ఇందుకు కారణమన్నారు.
గాండ్రింపులు డబుల్!
దేశంలో పులులు పెరుగుతున్నాయి. పుష్కర కాలంలో వాటి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2006లో మన దేశంలో కేవలం 1411 పులులు మాత్రమే ఉండగా.. 2014 నాటికి 2,226కు పెరిగింది. ప్రస్తుతం వాటి సంఖ్య 2,967. మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పులులు పెరుగుతూ ఉంటే.. విచిత్రంగా అడవులు ఎక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీ్‌సగఢ్, ఒడిసా తదితర రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. నాలుగేళ్ల కిందట (2014) మధ్యప్రదేశ్‌లో కేవలం 308 పులులు ఉండగా.. 2018 నాటికి వాటి సంఖ్య 526కు పెరిగింది. దేశంలో అత్యధిక పులులు ఉన్నది మధ్యప్రదేశ్‌లోనే! కాగా, ప్రపంచవ్యాప్తంగా పులులకు సురక్షిత ప్రాంతంగా దేశం మారుతోందని ప్రధాని మోదీ అభివర్ణించారు.
వాటి సంరక్షణ యత్నాలను కొనియాడారు. ‘‘2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని తొమ్మిదేళ్ల కిందట సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో తీర్మానించాం. కానీ, నాలుగేళ్ల ముందుగానే మనం దానిని సాధించాం. పులుల సంరక్షణకు మా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’ అని అన్నారు. ప్రపంచంలో అత్యధిక పులులున్న, సురక్షిత దేశాల్లో భారత్ కూడా ఒకటని మనం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.

No comments:
Post a Comment