Thursday, March 12, 2020

ప్రపంచ మహమ్మారి (పాండమిక్‌) అంటే..?

ప్రపంచ మహమ్మారి (పాండమిక్‌) అంటే..?

కరోనా వైర్‌సను ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అసలు దీని అర్థం ఏంటి? ఏ వ్యాధైనా అనేక దేశాల్లో (ప్రపంచవ్యాప్తంగా) ఒక వ్యక్తి నుంచి మరొకరికి ఒకే సమయంలో సోకినపుడు దాన్ని పాండమిక్‌ అంటారు. సాధారణంగా ఈ పాండమిక్‌ కింద కొత్త వైర్‌సలు వ్యక్తుల నుంచి వేరొకరికి చాలా సులువుగా సోకుతుంటాయి. వాటిని అదుపు చేయడం అంత తేలిక కాదు. కరోనాను ఎదుర్కొనడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లూ లేవు. అందుకే దీన్ని నిరోధించడమే మార్గాంతరం.

125 దేశాల్లో కొవిడ్‌ కల్లోలం

  • ఐరోపాతో నెలపాటు కటీఫ్‌
  • రవాణాపై ట్రంప్‌ ఆకస్మిక ప్రకటన
  • మనుషులకే... సరకులకు కాదని వివరణ
  • ఆంక్షలు వ్యర్థం... మండిపడ్డ ఈయూ 
  • భద్రతా మండలి సమావేశాల కుదింపు

వాషింగ్టన్‌, మార్చి 12: కరోనావైరస్‌ ప్రపంచాన్ని కమ్మేసింది. ఇది ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు ప్రకటించిన వేళకు ఏకంగా 125 దేశాల్లో విలయతాండవం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం దాసోహమైంది.వాషింగ్టన్‌ డీసీ సహా 15 రాష్ట్రాల్లో ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించారు. పరిస్థితి చేజారడంతో 30 రోజుల పాటు తమ దేశానికి రావొద్దంటూ 26 ఐరోపా సమాజ దేశాలకు అధ్యక్షుడు ట్రంప్‌ బాంబు పేల్చారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఈయూ సరిగా స్పందించలేదని ఆయన తప్పుబట్టారు. స్వదేశాలకు వచ్చే అమెరికన్లకు ఈ బ్యాన్‌ వర్తించదని, వాణిజ్య కార్యకలాపాలు కూడా కొనసాగుతాయని చెప్పారు.

ట్రంప్‌ కూడా కొలరాడో, నెవెడా, విస్కాన్‌సన్‌ల్లో ఎన్నికల సభలను రద్దు చేసుకున్నారు. వైరస్‌ దెబ్బకు ఘోరంగా పడిపోయిన ఆర్థికవ్యవస్థలను ట్రంప్‌ నిర్ణయం మరింత గాయపరుస్తుందని, మాంద్యం పెరిగేందుకు అవకాశం ఇస్తుందని, ఆర్థిక విధ్వంసం చోటుచేసుకుంటుందని ఈయూ దేశాలు మండిపడ్డాయి. ‘ఇది ప్రపంచ సంక్షో భం. ఈ సమయంలో కావల్సినది అన్ని దేశాల పరస్పర సహకారం. ఏకపక్ష నిర్ణయాలు కాదు’ అని యూరోపియన్‌ కౌన్సిల్‌, యూరోపియన్‌ కమిషన్‌ల అధ్యక్షులు విమర్శించారు. 

హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌కు కరోనా
హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ టామ్‌ హాంక్స్‌, ఆయన భార్య రీటా హాంక్స్‌కు కరోనా సోకింది. విఖ్యాత గాయకుడు ఎల్విస్‌ ప్రెస్లీపై వార్నర్‌ బ్రదర్స్‌ తీసే సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనుల నిమిత్తం ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. తమకు నీరసం, చలిజ్వరం, ఒళ్ల నొప్పులు రావడంతో పరీక్ష చేయించుకున్నామని, కరోనా లక్షణాలున్నట్లు ధ్రువపడిందని టామ్‌ తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి ఈ నెలలో జరపతలపెట్టిన మెరైన్‌ బయోడైవర్సిటీ, దేశీ య, స్థానికాంశాలు, మహిళా సమస్యలపై తలపెట్టి న సదస్సులను వాయిదా వేసుకుంది. అటు భద్రతా మండలి తన షెడ్యూల్‌ను కుదించుకుంది. డెలిగేట్ల సంఖ్యను భారీగా తగ్గించాలని సభ్య దేశాల ను కోరింది. సమావేశాలు విశాలమైన హాళ్లలో ఉండేట్లు చూడాలని నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వార్షిక సమావేశాలను కరోనా కారణంగా రద్దు చేసింది.

తీవ్ర దశను దాటేశాం : చైనా
చైనా దాదాపుగా తెరిపిన పడ్డట్లే కనిపిస్తోంది. హ్యూబై రాష్ట్రంలో గురువారం కొత్త కేసులు 8 మాత్ర మే నమోదయ్యాయి. డిసెంబరులో వైరస్‌ మొదలయ్యాక సింగిల్‌ డిజిట్‌లో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. అయితే వ్యాధి బారిన పడ్డ 4,257 పరిస్థితి విషమంగానే ఉంది. ‘వైరస్‌ అత్యధిక దశను దాటేశాం. ఆటో రంగంలో కీలకమైన వుహాన్‌లో కొన్ని పరిశ్రమలను తెరుస్తున్నాం’ అని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రతినిధి లీ ఫెంగ్‌ చెప్పారు.
ఐఎంఎఫ్‌ సాయం కోరిన ఇరాన్‌
దేశమంతా వైరస్‌ విస్తరించి, వాణి జ్యం,ఎగుమతులు దెబ్బతినడంతో ఆర్థికసాయం అందించాలని ఐఎంఎఫ్‌ను ఇరాన్‌ అర్థించిం ది. ఇప్పటికే అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కాగా, పశ్చిమాసియా, గల్ఫ్‌ దేశాల్లో కేసుల సంఖ్య గురువారంనాడే  10 వేలకు పైగా నమోదయ్యాయి. వీటిలో ఇరాన్‌ పరిస్థితి మరీ గడ్డుగా ఉంది. మరణాల సంఖ్య429కు పెరిగింది.                                                    
మోదీకి నెతన్యాహూ ఫోన్‌
వైరస్‌ త్వరగా వ్యాపిస్తుండడంతో వివిధ దేశాల సాయాన్ని ఇజ్రాయెల్‌ అర్థించింది. భారత ప్రధాని, నా స్నేహితుడు మోదీకి కూడా ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించానని, సాయం కోరానని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ చెప్పారు. కరోనా వైరస్‌ ఓ ఏడాదికాలం లేక అంతకంటే ఎక్కువే ఉంటుందని సింగపూర్‌ ప్రధాని లీ సియెన్‌ లూంగ్‌ అంచనా వేశా రు. ‘ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. రవాణా ఆంక్షలు విధించాం. అయితే ఎల్లకాలం ప్రపంచంతో సంబంధాలు లేకుండా గడపలేం’ అన్నారాయన. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గత వారం ఫ్లోరిడా రిసార్టులో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారోను కలి శారు. బోల్సనారోతో ఆయన సమాచార అధికారి ఫాబియో వజింగార్టెన్‌ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. స్వదేశం వెళ్లాక ఫాబియోకు వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది.

కెనడా ప్రధాని భార్యకు వైరస్‌
కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడోకు కరోనా సోకింది. దాంతో తామిద్దరం స్వయంగా ఏకాంతవాసంలో ఉండనున్నట్లు ట్రూడో ప్రకటించారు. ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించనున్నట్లు తెలిపారు. 

అరుణ గ్రహంపైకి మిషన్‌ వాయిదా
అంగారకుడిపై పరిశోధనలకు గాను రష్యా-ఐరోపా సమాజం సంయుక్తంగా పంపదలిచిన అంతరిక్ష నౌకను రెండేళ్ల పాటు వాయిదా వేశాయి. మార్స్‌పై జనజీవనానికి అవకాశం ఉందా లేదా అన్నది పరిశోధించడానికి ఓ రోబోను అక్కడ ప్రవేశపెట్టాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం. కరోనా వైర్‌సని దృష్టిలో పెట్టుకుని, అన్నీఆ లోచించాక- ఈ ప్రయోగాన్ని 2022కు వాయిదావేశామని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్‌ అధ్యక్షుడు దిమిత్రి రోగోజిన్‌ చెప్పారు. 

మోదీకి బ్రిటన్‌ ప్రధాని ఫోన్‌
ప్రధాని నరేంద్ర మోదీకి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గురువారం రాత్రి ఫోన్‌ చేసి వైరస్‌ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, సహకారంపై చర్చించారు. బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి నాడిన్‌ డోరీస్‌కు వైరస్‌ సోకడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎవరెస్ట్‌ మూసివేత
ఎవరెస్ట్‌ శిఖరాధిరోహణను చైనా మూసేసింది. ఈ శిఖరానికి నేపాల్‌ వైపు నుంచి అత్యధికంగా వెళ్తారు. చైనా ఉత్తర ప్రాంతం నుంచీ, టిబెట్‌ నుంచీ వెళ్లే వీలుంది. ఈ దారుల్లో వెళ్లేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. బేస్‌ క్యాంప్‌ల్లో వైరస్‌ సోకే ప్రమాదం ఉండడం, చలి ప్రదేశాల్లో వైరస్‌ సోకేవారి పరిస్థితి తొందరగా విషమించే అవకాశం ఉండడం వల్ల అనుమతులు నిలిపేస్తున్నట్లు తెలిపారు. నేపాల్‌ మాత్రం యథావిధిగా కొనసాగించనుంది. 

అమెరికాలో నో షేక్‌హేండ్స్‌, నో కిసెస్‌
ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ అమెరికన్‌ రాజకీయవేత్తలు కరచాలనాలకు, ముద్దులకు దూరం పెట్టారు. కరోనా భయంతో ఒకర్నొకరు తాకడానికే ఇష్టపడడం లేదు. మరీ బావుండదని అనుకున్నారేమో... పిడికిళ్లు తాకించుకోవడం, భుజాలను పరస్పరం రాపాడించుకోవడం చేస్తున్నారు. ట్రంప్‌ ఇప్పటికే తన ర్యాలీలను రద్దు చేసుకోగా, డెమొక్రటిక్‌ పార్టీ నేతలు బెర్నీ సాండర్స్‌, జో బిడెన్‌ మాత్రం కొనసాగిస్తున్నారు. 

అమెజాన్‌, ట్విటర్‌ ప్రత్యేక చర్యలు
వర్క్‌ ఫ్రం హోం చేయాల్సిందిగా సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను కోరింది. అటు డెలివరీ దిగ్గజం అమెజాన్‌- తన ఉద్యోగులకు పెయిడ్‌ సిక్‌లీవు మంజూరు చేసి- ఇళ్ల దగ్గరే ఉండిపోవాలని కోరుతోంది.

కబళిస్తున్న మహమ్మారి
ఎన్ని దేశాలకు విస్తరించింది   125
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు  1,30,237
 
ఇందులో నయమై డిశ్ఛార్జి అయిన వారు68,677
చికిత్సలో ఉన్న  కేసులు56,804
ఇందులో క్రిటికల్‌గా ఉన్నవారు5,714
కొత్తగా నమోదైనవి1,600 
మొత్తం మృతుల సంఖ్య4,756 

చికిత్సలో ఉన్నవారు, మృతులు దేశాల వారీగా!
దేశం  కేసులుమృతులు
చైనా             14, 814 3169
ఇటలీ 10,590827
ఇరాన్‌             6687429
దక్షిణ కొరియా     747066
ఫ్రాన్స్‌              222148
స్పెయిన్‌           296884
అమెరికా           128338
జర్మనీ             1938 3
జపాన్‌ 509 16
బ్రిటన్‌                434          8
ఇరాక్‌             48            8
నెదర్లాండ్స్‌       496          5

No comments:

Post a Comment