Thursday, April 16, 2020

తెలంగాణ గబ్బిలాల వల్ల కరోనా రాదట

తెలంగాణ  గబ్బిలాల వల్ల కరోనా రాదట

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్, గుజరాత్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి అటవీ ప్రాంతాల్లో నివసించే గబ్బిలాలపై అధ్యయనం సాగింది. ఆయా రాష్ట్రాల్లో దాదాపు 500 గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారు. వీటిని రివర్స్ ట్రాన్స్‌ప్రిక్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పద్ధతిలో పరీక్షించారు. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లో నివసించే గబ్బిలాల్లో బ్యాట్ కరోనా వైరస్ ఉందని తేలింది. తెలంగాణలో కనిపించే గబ్బిలాల వల్ల కరోనా ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అయితే గబ్బిలాల్లో ఉండే రకరకాల వైరస్‌లు ఎప్పుడైనా ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాలు సహా అనేక జంతువుల్లో కరోనా జాతి వైరస్ లు ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. మన దేశంలో కనిపించే ఇండియన్ ఫ్లైయింగ్ ఫాక్స్, ఫ్రూట్ బ్యాట్స్ జాతి గబ్బిలాల్లో కరోనా జాతి వైరస్‌ను గుర్తించారు. అయితే ఈ గబ్బిలాల్లో గుర్తించిన వైరస్‌కు 2018లో ఇండోనేషియాలో నిఫా వైరస్, ఫ్రూట్స్ బ్యాట్స్  అనే గబ్బిలాల ద్వారా వ్యాపించింది. సాధారణ జలుబు నుంచి సార్స్, మెర్స్ దాకా రకరకాల అనారోగ్యాలు కలిగించే ఎన్నో వైరస్‌లు కరోనా కుటుంబంలో ఉన్నాయి. కోవిడ్-19 అందులో కొత్తది.